- Advertisement -
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్ళీ విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2,478 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 363 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,964 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,746గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 15,472 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,674 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 402 మందికి కరోనా సోకింది.
- Advertisement -