పరీక్షా పే చర్చ కాదు…పెట్రోల్‌ పై చర్చ..నెటిజన్ల ట్రోల్!

130
modi
- Advertisement -

2018 నుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీక్షలు రాయనున్న 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల్లో భయాలను తొలగించేందుకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణిలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు మోదీ కార్యక్రమంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్‌కు చేరుకోగా సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన వెలువరించకపోగా పది సంవత్సరాల వరకు పెట్రోల్ రేట్ ఇదే విధంగా ఉండనుందని సంకేతాలిచ్చారు.

దీంతో గతంలో యూపీఏ హయాంలో పెట్రోల్ ధరల పెంపుపై ఇదే మోదీ,ఇప్పుడున్న కేంద్రమంత్రులు చేసిన ఆందోళనలను షేర్ చేస్తూ వీరి దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. తాజాగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ పెట్రోల్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాలని మోదీ సార్‌కు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -