సీజేఐగా ఎన్వీ రమణ..రాష్ట్రపతి ఉత్తర్వులు

180
ramana
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఈ నెల 24న 48 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రమణ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆగష్టు 26, 2022 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఈ నెల 23న ప్రస్తుత సీజేఐ బాబ్డే పదవీ విరమణ చేయనున్నారు. 1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో ఎన్వీ రమణ జన్మించారు. జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

- Advertisement -