ఎమ్మెల్సీ కవితను కలిసిన జడ్పీటీసీ,ఎంపీటీసీలు

186
mlc kavitha
- Advertisement -

స్ధానిక సంస్థలకు బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవితను కలిశారు జడ్పీటీసీ,ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత… స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 202-21 బడ్జెట్‌లో జిల్లా పరిషత్ లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్ లకు రూ.248 కోట్లు కేటాయించిందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అందరితో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు.

జిల్లా పరిషత్ లకు, మండల పరిషత్ లకు నిధుల కేటాయింపునకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు కొనియాడారు. పరిపాలనా వ్యవస్థలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకమన్న ఎమ్మెల్సీ కవిత, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామన్నారు.

- Advertisement -