- Advertisement -
ఇటీవలి కాలంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారగా తాజాగా పదవీ విరమణ పొందిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు 38118/2018కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు టీటీడీ అధికారులు.
గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతోపాటు అర్చకులను విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు మళ్లీ విధుల్లో చేరనున్నారు.
అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -