కరోనా కొత్త గైడ్ లైన్స్ …ఇవే!

207
corona
- Advertisement -

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో కొత్త గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం. కరోనాను అరికట్టేందుకు మాస్క్‌,భౌతిక దూరం తప్పనిసరి చేయగా మైసూర్‌, కాలబురిగి, దక్షిణ కన్నడ, ఉడిపి, బీదర్‌, హుబ్లీ-ధార్వాడ్‌ సహా బెంగళూరు అర్బన్‌, రూరల్‌ తదితర జిల్లాల పరిధిలో ఆంక్షలు విధించింది. పబ్‌లు, బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో కస్టమర్ల సంఖ్య 50శాతానికి మించరాదని ఆదేశించింది.

6-9 తరగతులను నిలిపి వేసింది. జిమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ మూసివేసి ఉండనున్నాయి. అలాగే ధర్నాలు, ర్యాలీలు నిషేధించారు. షాపింగ్‌ మాల్స్‌, క్లోడ్‌ మార్కెట్లు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం నిబంధనలు అమలు చేయడంతో పాటు ఖచ్చితంగా హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

- Advertisement -