- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 89,129 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా 714 మంది మృతిచెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా ,64,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం 6,58,909 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులుండగా 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు కరోనాతో 1712 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
- Advertisement -