బీజేపీ హఠావో..దేశ్ బచావో..!

179
bj
- Advertisement -

దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రధాని మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విసిగిపోయిన ప్రజలు బీజేపీ కండువాలు కప్పుకుని ఎవరైనా కనిపిస్తే చాలు వెంటబడి తన్ని తరుముతున్నరు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడంపై దేశ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక పెట్రోల్ ధర సెంచరీ దాటడం, గ్యాస్, డీజిల్ ధరలను చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచడంపై బీజేపీపై సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ‌్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల అడిగేందుకు వస్తున్న వస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను తమ గ్రామాల్లోకి రాకుండా రైతులు, ప్రజలు తన్ని తరుముతున్నరు. ఇటీవల వ్యవసాయ చట్టాలకు మద్దతుగా రైతు ఉద్యమంపై నోరుపారేసుకున్న పంజాబ్ బీజేపీ ఎమ్మెల్యేను అక్కడి రైతన్నలు వెంటబడి బట్టలూడదీసి కొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దేశంలో బీజేపీ నేతలు ఎక్కడకు వెళ్లినా ప్రజలు వెంటబడి తరిమికొట్టే పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ ఉత్తరకుమారుడు యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో నల్ల వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయంటూ బీజేపీ నేతలు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రైతన్నలు అడ్డుకున్నరు.. బీజేపీ ముర్దాబాద్ , గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రైతులు తిరగబడడంతో కాషాయ కార్యకర్తలు భయపడి బైకులు వెనక్కి తిప్పి పారిపోయిన్రు..అక్కడ పోలీసోళ్లు చాలా మందే ఉన్నా రైతుల ఆగ్రహం చూసి సైలెంట్ అయిపోయిన్రు.ఇక హర్యానా రాష్ట్రంలో కూడా ఇదే సీన్ రిపీటైంది. బీజేపీ కార్యకర్తలు కమలం గుర్తు ఉన్న టీషర్టులు వేసుకుని నల్ల రైతు చట్టాలు రైతులను ఉద్దరిస్తాయని బైక్ ర్యాలీ మొదలుపెట్టిన్రు. ఇంతలో ఎదురుంగ రైతులు కనిపించిన్రు.. అంతే బీజేపీ బత్తాయిలు భయపడిపోయిన్రు. రైతులకు కనిపిస్తే ఎక్కడ తంతారో అన్న భయంతో వెంటనే తమ టీషర్టులను, కాషాయకండువాలను రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి పారిపోయిన్రు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నయి కదా…అక్కడ అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ నేతలు 20 సీట్లలో పోటీ చేస్తున్నరు.

దీంతో బీజేపీ కార్యకర్తలు కాషాయకండువాలు వేసుకుని, ఓ ఆటో వేసుకుని ఊరూరా తిరుగుతూ కరపత్రాలు పంచుకుంటూ ప్రచారం చేస్తున్నరు. అసలే తమిళతంబీలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నరు. ఓ తమిళతంబీ బీజేపీ కార్యకర్తలు కనిపించగానే కోపంతో మండిపడిండు..వెంటనే వారి చేతుల్లోని కరపత్రాలు లాక్కుని చించి పారేసి..మీ బీజేపోళ్లకు తమిళనాడులో ప్రచారం చేసుకునే అర్హతకూడా లేదు..మా ఏరియాలోకి ఇంకోసారి వస్తే బాగుండదూ అంటూ మర్యాదగా క్లాస్ పీకిండు..దీంతో ఆటో తిప్పుకుని బీజేపీ బత్తాయిలు అక్కడి జంప్ అయిన్రు..ఇక మనం అస్సాం పోదాం..అక్కడ కూడా ఇదే సీన్.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను అక్కడి ప్రజలు వెనక్కి పంపుతున్నరు. మా ఊర్లోకి రావద్దు..నైనై జాజా ..బీజేపీ హఠావో..ఇన్ని రోజులకు వచ్చిన్రా…అంటూ వెనక్కి పంపించిన్రు. మొత్తంగా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే చాలు రైతులు, సామాన్యప్రజలు కోపంతో ఊగిపోతూ తన్ని తరుముతున్నరు. ఉత్తరాది రాష్ట్రాలలో లాగే మన తెలంగాణలో కూడా బీజేపీని తన్ని తరిమే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి. ముందు బీజేపీని సాగర్ నుంచి తరిమిస్తే..ఆ తర్వాత తెలంగాణ అంతటా బీజేపీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయం.. బీజేపీ హఠావో..దేశ్ బచావో ఇఫ్పుడిదే దేశ ప్రజల నినాదంగా మారింది.

- Advertisement -