బండి గిదేంది..లాంబాడీలను ఎస్టీ నుండి తొలగించండి.. సాగర్‌లో ఎస్టీ అభ్యర్థి!

219
bandi
- Advertisement -

బాప్ ఏక్ నెంబర్ హే..బేటా దస్ నెంబర్ హే అంటే తెలంగాణ బీజేపీకి సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే అబద్దాలు చెప్పడంలో మోదీ,అమిత్ షాలను మించి పోతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్ర నాయకత్వంతో పోటీ పడి మరి అబద్దాలను వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు స్థానికంగా విద్వేశాలు రెచ్చగొట్టడం,మత,కుల అంశాలను తెరపైకి తెస్తూ రాజకీయ లబ్ది పొందడం కాషాయ నేతలకు అలవాటుగా మారిపోయింది.

ఇందులో భాగంగా సాగర్ ఎన్నికల వేళ బీజేపీ, బండి సంజయ్ తీసుకున్న వైఖరి ఆ పార్టీ నేతలను చిక్కుల్లో పడేసింది. ఓ వైపు సాగర్‌లో ఎస్టీ అభ్యర్థి రవికుమార్‌ని రంగంలోకి దించిన బండి సంజయ్‌….మరోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ సోయం బాపురావుతో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రధానమంత్రి మోదీకి వినతిపత్రం ఇచ్చేలా చేశారు. దీంతో ఈ యాక్సిడెంటల్ ఎంపీ బండి రాజకీయ అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది.

లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్న ఎంపీ సోయం బాపురావును వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం చేయడం రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించింది. సాగర్‌ ఉప ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని బండి సంజయ్ ఓట్లు అడుగుతారని…వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు లంబాడా సంఘం నేతలు.

వాస్తవానికి బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరికి తీసుకోవడం ఇది కొత్త కాదు. కేంద్రం నుండి రూపాయి తీసుకురారు…కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పథకంలో కేంద్రం డబ్బులున్నాయని వితండవాదానికి దిగుతారు. వందసార్లు అబద్దాన్ని ప్రచారం చేస్తే అది నిజం అయిపోతుందనే భ్రమలో ఉండే కమలనాథులు..తమ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అంధ భక్తులతో విషప్రచారానికి దిగుతారు. దానికి మతం,కులం ,హిందూత్వ,దేశభక్తి అనే మసాలాను అద్ది ఎంతవీలైతే అంత ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తారు. పొరపాటున గెలిస్తే అంతే…..ఓడిపోతే నైతిక విజయం మాదేననే స్టేట్ మెంట్. మొత్తానికి బండి సంజయ్ తన అవగాహన రాహిత్యం…బీజేపీకి ఎంత ప్లస్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆయన మాటలు,నాయకత్వ తీరు ప్రజల్లో కాషాయ పార్టీని నవ్వుల పాలు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -