సొంత ఇంటి స్థలం ఉన్నవారికి సీఎం కేసీఆర్ త్వరలో శుభవార్త అందించనున్నారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్ రావు.. బడ్జెట్‌లో ఇందుకోసం పది వేల కోట్ల రుపాయాలను కేటాయించిందన్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరీలో ఇబ్బందులు ఎదరవ్వకుండా బడ్జెట్‌లో మూడు వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి మరోసారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖసంతోషాలతో జరుపుకొంటున్నారని అన్నారు.
నాబార్డు సహకారంతో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్, గుర్రాలగొంది, ఇర్కొడు, పెద్ద లింగారెడ్డిపల్లి, వెంకటాపూర్, విఠలాపూర్ గ్రామాలకు చెందిన రైతులకు రెండో విడత కింద ఒక్కొక్కరికి రూ. 23,750 చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు.