- Advertisement -
నా మీద నమ్మకంతో టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన భగత్…..పార్టీలో చేరినప్పటి నుండి మా నాన్న నోముల నరసింహయ్య కు కెసిఆర్ సముచిత స్థానం కల్పించారని…..కెసిఆర్ ప్రభుత్వ పథకాలే మా నాన్న ను గెలిపించాయన్నారు.
…ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్న ను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరం అన్నారు. మా నాన్న ఆశయాలు నెరవేరుస్తా…….నాన్న చనిపోయాక వచ్చిన ఎన్నికలు ఇవి ప్రజలు నన్ను ఆదరిస్తారని భావిస్తున్నా అన్నా అన్నారు. నర్సింహయ్య వారసునిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషం……లక్షన్నర కు పైగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు నాగార్జున సాగర్ లో ఉన్నారని తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు మా నియోజకవర్గంలో బిజెపి ఏమి పెరగలేదన్నారు.
- Advertisement -