రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ..

203
kovind
- Advertisement -

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యానికి గురికావడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను ముందుగా ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం శనివారం ఎయిమ్స్ కు తరలించారు. అయితే, వైద్య పరీక్షల అనంతరం రామ్ నాథ్ కోవింద్ కు మంగళవారం బైపాస్ ప్రక్రియ నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపింది. ఎయిమ్స్ వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించింది.

- Advertisement -