అర్వింద్ చిల్లర వ్యాఖ్యలు..నిజామాబాద్ ప్రజల ఫైర్..!

182
aravind
- Advertisement -

నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో నిజామాబాద్‌కు పసుపుబోర్డు తీసువస్తానని చెప్పి …బాండు పేపరు రాసి మాట తప్పిన బోడ గుండోడు ఎక్కడా అని… పసుపు రైతులు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. పసుపు రైతులకు దొరికితే ఎక్కడ తన గుండుకు పసుపు రాసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తరో అన్న భయంతో అర్వింద్ పార్లమెంట్ సమావేశాల పేరుతో ఢిల్లీలో దాక్కున్నడు. ఇక ఢిల్లీలో చిన్న చెడ్డీ వేసుకుని, పసుపుబోర్డుపై తన బండారం బయటపెట్టిన టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కిండు..పైగా ఓ ఎంపీగా హుందాగా ఉండేది పోయి..ఓ టీ షర్ట్..చిన్న చెడ్డీ వేసుకుని జిమ్ము చేస్తూ ఓ బాడీ బిల్డర్‌లా బిల్డప్ ఇస్తూ టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డిపై చిల్లర వ్యాఖ్యలు చేసిండు..మన నిజామాబాద్ జిల్లా పెద్దమనిషి సురేష్ రెడ్డి.. రాజకీయంగా బతికే ఉన్నానని ఈ రోజు అందరికీ యాది చేసిండు ఇవాళ అంటూ విమర్శించాడు.

ఈయన కథ ఎట్ల ఉందంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు పడినట్లు ఉందని, తోటి ఎంపీ అన్న గౌరవం లేకుండా కారు కూతలు కూసిండు..మీ చరిత్ర హీనమైన కాంగ్రెస్ పార్టీ 1987లో ఎటువంటి సంబంధం లేని కేరళలో స్పైసెస్ బోర్డు పెట్టింది.. అవసరం లేకున్నా విదేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుందని ఆరోపించిండు..ఇవ్వాళ బీజేపీ ప్రభుత్వం స్పైసెస్ బోర్డును నిజామాబాద్‌కు తెచ్చిందని.. దిగుమతులు ఆపడంతోపాటు ఇక్కడి నుంచే పసుపును ఎగుమతి చేయడం మొదలుపెట్టిందని అర్వింద్ బిల్డప్ ఇచ్చుకుండు… పసుపు రైతులకు మండల స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పలు స్కీమ్‌లు అమలు చేసిందన్నారు. అందువల్లే ఈ రోజు పసుపు ధర పెరిగిందని అర్వింద్ భుజాలు చర్చుకున్నడు..ఒకప్పడు సురేష్ రెడ్డి అనే తోపు చౌటపల్లిలో బాపు అనిపించుకున్నాది…ఇప్పుడు కేసీఆర్ దగ్గర బానిసత్వం చేస్తున్నాది అంటూ వెటకారం ఆడాడు..ఇక మా అయ్య తమ్ముడు అంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీపై కూడా విరుచుకుపడ్డడు..మా అయ్య తమ్ముడు మధుయాష్కీ ఏదో ట్వీట్ చేసిండట.

ఇక ఆయనకు కూడా నేను రియాక్ట్ అయితే నిజామాబాద్ ప్రజలు తనకు పని లేదనుకుంటారని.. కాబట్టి ఆయన్ను లైట్ తీసుకుంటున్నా అంటూ అర్వింద్ పిచ్చి వాగుడు వాగిండు. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌ రెడ్డిని అర్వింద్ చేసిన చిల్లర కామెంట్స్‌పై నిజామాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్‌గా, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న నేతగా సురేష్ రెడ్డి పేరుగాంచారు. తెలంగాణలో హుందాగా ఉండే నేతల్లో సురేష్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించి తన బండారం బయటపెట్టాడన్న కోపంతో నిజామాబాద్ ప్రజలు బాపు అని పిలిపించుకునే సురేష్‌రెడ్డిపై తోపు, బానిస అంటూ నోరుపారేసుకున్న అర్వింద్‌పై నిజామాబాద్ ప్రజలు, పసుపు రైతులు, టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నరు. పెద్దాయన సురేష్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పకపోతే అర్వింద్‌‌ను ఉరికించి కొడతం అంటూ పసుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు వార్నింగ్ ఇస్తున్నరు.మొత్తంగా పసుపుబోర్డుపై తన మోసం బయటపడడంతో అర్వింద్‌కు ఏం చేయాలో అర్థం కాక ఇలా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై పిచ్చెక్కినట్లు పిచ్చి వాగుడు వాగుతున్నాడని నిజామాబాద్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.

- Advertisement -