అరవింద్ సార్ ఎక్కడ…తమిళనాడుకు పసుపుబోర్డు..మరీ తెలంగాణకు!

156
aravind
- Advertisement -

పేరుకే జాతీయ పార్టీ..కానీ ప్రాంతానికో విధానం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలుంటే చాలు. మాటల్లో మెట్రో వస్తది, ఐటీఐఆర్ వస్తది,ప్యాకేజీలు వస్తాయి, రైల్వే జోన్లు వస్తాయి….ఇంకా పసుపు బోర్డు వస్తది. ఇది బీజేపీ నేతల వైఖరీ. తెలంగాణలో పసుపు బోర్డు పేరుతో గెలిచిన ఆ పార్టీ ఎంపీ దానిపై నొరెత్తకుండా అడక్కుండానే తమిళనాడలో ఎన్నికలున్నాయి కాబట్టి పసుపు బోర్డు ఇస్తారట.

దీంతో బీజేపీ వైఖరీపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తగలబెట్టారు. పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని రైతులు ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించారు. ఈ అంశం పైనే ప్రధాన హామీ ఇచ్చి గెలిచిన బిజెపి ఎంపి అరవింద్ ఆ విషయాన్ని ఇప్పుడు విస్మరించారు.

నిజామాబాద్‌లో ఏర్పాటు చేయలేమని చెప్పిన బిజెపి….. తన ఎన్నికల మేనిఫెస్టోలో తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తామని ప్రకటించారో వివరించాలని పసుపు రైతులు అరవింద్ సార్‌ని డిమాండ్ చేస్తున్నారు. దేశం మొత్తంలో పసుపు లక్ష 70 వేల హెక్టార్లలో పండిస్తుండగా అందులో మూడో శాతం అంటే 55 వేల హెక్టార్లలో పసుపు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లో పండుతున్నది.

దేశం మొత్తంలో పసుపు 13 లక్షల టన్నులు పండిస్తుండగా ఇక్కడ ఒక్క నాలుగు జిల్లాల్లోనే 3 లక్షల టన్నుల పసుపును పండిస్తున్నారు. ఇక్కడ పసుపు బోర్డు వస్తే పసుపు రైతులకు మద్దతు ధరనే కాకుండా ఎగుమతికి అనుకూలమైన పసుపును పండించవచ్చునని దీని ద్వారా పసుపు నాణ్యత దిగుబడిని పెంచుకోవచ్చునని రైతులు ఆశపడుతున్నారు. కానీ వారికి షాక్‌ ఇచ్చేలా,పుండు మీద కారం చల్లేలా తెలంగాణకు మొండి చేయిచూపి తమిళనాడుకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పడం బీజేపీ ద్వంద వైఖరికి నిదర్శనమని వారికి తగిన బుద్ది చెబుతామని పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు. దీనిపై బండి సంజయ్,అరవింద్‌లు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -