జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయం లో ఘనం గా జరిగింది.
నందమూరి హరికృష్ణ , నందమూరి రామకృష్ణ, దర్శకులు వి వి వినాయక్, దిల్ రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, యలమంచిలి రవి శంకర్, కిలారు సతీష్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశి తదితరులు పూజా కార్యక్రమానికి విచ్చేశారు. తొలి షాట్ కి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి హరికృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల పై తొలి షాట్ కు వి . వి . వినాయక్ గారు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా రాశీ ఖన్నా ను ఇప్పటికే ఖరారు చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి సి. కె. మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ‘టెంపర్ ‘ , ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గారేజ్ ‘ చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు.
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ” సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై #NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. ఫిబ్రవరి 15 నుండి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది” అని అన్నారు.