కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని, ఇది ఆంధ్రాకు లింకులేని అంశమని డిమాండ్ చేశారు ఎంపీ నామా నాగేశ్వర్ రావు. లోక్ సభలో ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ్న సందర్భంగా మాట్లాడిన నామా….రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జగడాలు ఉన్నట్లు మంత్రి చెబుతున్నారని, కానీ అలాంటి సమస్య ఉంటే చెప్పాలన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య జగడాలు లేవు అని, సీఎం కేసీఆర్, సీఎం జగన్‌లు సమస్యలను పరిష్కరించేందుకు మీవద్దకు అనేక సార్లు వచ్చారన్నారు. పెండింగ్ అంశాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు నామా.
ఏపీ విభజన చట్టం అమలు తీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు ఎంపీ రామ్ మోహన్ నాయుడు. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు అయ్యాయో చెప్పాలన్నారు. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. కేంద్రం వద్ద ఎటువంటి సమస్యలు పెండింగ్‌లో లేవన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇచ్చామన్నారు.