అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించి, యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్‌ను దాటింది. వరుస బాంబు దాడులతో దేశంలో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో.. ఆ టెర్రరిస్టులను తన టీమ్‌తో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా పనిచేసే విజయ్ వర్మ ఎలా తుదముట్టించాడనే విషయాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా, రోమాలు నిక్కబొడుచుకొనే రీతిలో దర్శకుడు అహిషోర్ సాల్మన్ రూపొందించారు. ట్రైలర్ చూస్తే, ఆ విషయం స్పష్టమవుతుంది. ఏసీపీ విజయ్ వర్మను వైల్డ్ డాగ్ అని ఎందుకంటారో కూడా మనకు ట్రైలర్ తెలియజేసింది. ఆ క్యారెక్టర్‌లో నాగార్జున లుక్స్‌కు, ఆయన యాక్షన్‌కు ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ ప్రియులందరూ ఫిదా అవుతున్నారు. ట్రైలర్‌తో ‘వైల్డ్ డాగ్’పై ఆడియెన్స్‌లో క్రేజ్ మరింతగా పెరిగింది.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో హీరో నాగార్జున ఎగ్రెసివ్‌గా పబ్లిసిటీ చేస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని ఓ స్టిల్‌ను రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్‌లో కొండలు కనిపిస్తుండగా, చేతిలో ఏకే 47 గన్ పట్టుకొని పరుగెత్తుతూ కనిపిస్తున్నారు నాగ్. అంటే ఆయన టెర్రరిస్టులకు సంబంధించిన ఒక ఆపరేషన్ మీద ఉన్నారని అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత ఆయనకు పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ లభించింది. ఆ రోల్‌లో ఆయన విజృంభించి నటించారు.
ట్రైలర్ చూశాక ఈ సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రశంసిస్తున్నారు.. షానీల్ డియో సమకూర్చిన సినిమాటోగ్రఫీ, డేవిడ్ ఇస్మలోన్, జాషువా రూపకల్పన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా నటిస్తోన్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్ డైరెక్టర్: డేవిడ్ ఇస్మలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
ఆర్ట్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్.