ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్‌: మంత్రి అల్లోల

138
minister allola
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించి సీఎం కేసీఆర్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించారని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండి అనేక సమస్యలను పరిష్కరించించిన సీఎం కేసీఆర్….ఇప్పుడు కూడా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచి ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేయస్సుకు కట్టుబడిన ప్రభుత్వమని మరోసారి నిరూపించార‌న్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాల పెంచి సీఎం ప్రకటించి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని చెప్పారు.

- Advertisement -