కరోనా పంజా…ఏడుపాయల ఆలయం మూసివేత

163
Edupayala
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్కూల్స్, గురుకులాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు కేజీబీవీ, గురుకుల పాఠశాలలో 32 మంది విద్యార్థినులు, ఐదుగురు ఉపాధ్యాయులకు కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.

వైరస్‌ ప్రబలిన విద్యార్థినులకు వసతి గృహాల్లోనే ప్రతేక గదుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా కారణంగా మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల దుర్గామాత ఆలయాన్ని వారం రోజులపాటు మూసేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇటీవల జరిగిన మహా శివరాత్రి ఉత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంణ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చారు. జాతర అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు.

- Advertisement -