దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు నమోదుకాగా 188 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,55,284కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 2,88,394 యాక్టివ్ కేసులుండగా 1,11,07,332 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 4,20,63,392 డోసులు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. వైరస్ వ్యాప్తి ప్రభావితమైన జిల్లాల్లో గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిని, సాగర్, బేతుల్, బుర్హాన్‌పూర్, ఖార్గోన్, రత్లం, చింద్వారా జిల్లాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు విధించారు.