బండి సంజయ్‌పై ఐపీఎస్ అసోసియేషన్ గరం గరం!

200
bandi
- Advertisement -

భైంసా అల్లర్ల నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు,ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ నేపథ్యంలో బండి వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ అధికారులు. భైంసా ఘటనలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారని…పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయేలా బండి సంజయ్ వాఖ్యనించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పగలు, రాత్రి తేడాలేకుండా కష్టపడుతున్నాం అని ఇలాంటి సమయంలో పోలీసులపై ఇలాంటి పదజాలాన్ని వాడటం సరికాదని మండిపడ్డారు. కోవిడ్ సమయంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషించారని.. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

- Advertisement -