నరేంద్రమోదీ సర్కార్‌పై కొంతకాలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు పెట్రోల్,డీజీల్ ధరలు పెరగడం మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో మోదీపై ఉన్న ఆశలు అన్ని నీరుగారిపోతున్నాయి. బ్రిటిష్ వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే బీజేపీది ఊస్ట్ ఇండియా కంపెనీ అని మండిపడుతున్నారు.
విశాఖ ఉక్కుకు రూపాయి ఇవ్వం…రేటు వస్తే అమ్మేస్తాం లేదా మూసేస్తామని మోదీ ప్రకటన చేయడంపై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. పటేల్ విగ్రహానికి 3000 కోట్లు,ప్రచారాలకు 5వేల కోట్లు, ఎన్నికలకు 27000 కోట్లు,కార్పొరేట్లకు లక్షా 40 వేల కోట్లు,నమస్తే ట్రంప్‌కు 100 కోట్లు, ప్రధానమంత్రి రక్షణకు 600 కోట్లు,ప్రతిపక్ష నాయకులను కొనడానికి వందల కోట్లు కానీ విశాఖ ఉక్కుకు రూపాయి ఇవ్వం..ఇది బ్రిటిష్ వాడి వ్యాపారానికి..బీజేపీ వ్యాపారానికి తేడా లేదనడానికి ఇదొక నిదర్శనమని తూర్పారబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మోడీ ఫోటోతో పాటు ఇప్పటివరకు అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల వివరాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.