- Advertisement -
దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కేసుల వివరాలను విడుదల చేసింది. వాటి ప్రకారం… దేశంలో గత 24 గంటల్లో 24,492 మందికి కరోనా నిర్ధారణ అయింది. 20,191 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,856కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,27,543 మంది కోలుకున్నారు. 2,23,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి వ్యాక్సిన్లు వేశారు.
- Advertisement -