- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. దాంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 38.1 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 38.1, కేరమెరిలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని మైత్రీవనంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం వడ్డెమాన్‌లో 14.5, హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో పొడివాతావరణం ఏర్పడింది. రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
- Advertisement -