ఈ నెల 18న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఈ మేరకు జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి,హరీష్ రావుతో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సమాధానం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నెల 19, 21 తేదీల్లో శాసనసభ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 26వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు.