- Advertisement -
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు జరుగగా జాతీయజెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్.
ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు.
75 వారాలపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -