ఏపీలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

251
ktr
- Advertisement -

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రజలు. దశలవారీ ఉద్యమ ప్రణాళిక నిర్ణయించింది ఉక్కు పరిరక్షణ జేఏసీ నేతలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలుగువారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పోరాడి సాధించుకొన్న విశాఖ ఉక్కును వందశాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమాన్ని మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకూ వస్తారు. విశాఖ ఉక్కును అమ్ముతున్నట్టుగానే రేపు బీహెచ్‌ఈఎల్‌, ఎల్లుండి సింగరేణిని అమ్ముతారు అని హెచ్చరించారు.

- Advertisement -