దేశానికే రోల్ మోడల్‌గా ‘వీ’ హబ్: కేటీఆర్

158
ktr
- Advertisement -

మూడేండ్ల క్రితం ప్రారంభ‌మైన వీ-హ‌బ్ దేశానికే రోల్‌మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఐటీసీ కాక‌తీయ‌లో అప్‌స‌ర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్, భార‌త్‌లోని ఆస్ర్టేలియా హైక‌మిష‌న‌ర్ హెచ్ఈ బారీ ఓ ఫ‌ర్రెల్, సౌత్ ఇండియాలోని ఆస్ర్టేలియా కాన్సూల్ జ‌న‌ర‌ల్ సారా కిర్ల్యూ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వీ-హ‌బ్‌తో మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్రోత్సాహం ల‌భిస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిభ ఉన్న మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం చేయూత‌నిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో వీ-హ‌బ్ ద్వారా గుజ‌రాత్‌, క‌శ్మీర్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌రుచుకున్నామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆస్ర్టేలియా ప్ర‌భుత్వంతో భాగ‌స్వామ్యం కావ‌డం మంచి ప‌రిణామం అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -