సీఎం కేసీఆర్‌పై నమ్మకముంది: ఉద్యోగ సంఘాల నేతలు

198
cm kcr
- Advertisement -

పీఆర్సీ నివేదిక ఇచ్చాక ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు ఉద్యోగ సంఘాల నేతలు. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు..రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులకు 11 వ వేతన సవరణ తో పాటు ఈ పీఆర్సీ లో కూడా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేయదు అన్నారు.

ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారని ఎన్నికలు ముగిసిన తరువాత పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు.ఉద్యోగుల పదవి విరమణ వయస్సు కూడా త్వరలోనే అమలు చేస్తాం అని సీఎం తెలిపారని ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణ కు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారన్నారు.

ఎన్నికల నియమావళి కి లోబడి ఇవాళ సీఎం కేసీఆర్ తో చర్చించామని…2014 తరువాత దేశంలోనే తెలంగాణ లో అత్యధిక పీఆర్సీ సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు.ఉద్యోగుల ప్రమోషన్ లు కూడా చాలా త్వరితగతిన ఇచ్చారని…పీఆర్సీ వాళ్ళు ఎంత రేకామెండ్ చేసిన మీకు ఎంతో ఇవ్వాలో ఇస్తాం మీకు జన్యున్ గా రావల్సిన పీఆర్సీ వస్తుందని తెలిపారన్నారు.

సీపీఎస్ ఉద్యోగుల కుటుంబలకు పెన్షన్ స్కిం అమలు చేస్తాం అని తెలిపారని…ఏపీ కంటే కంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
సీఎం కేసీఆర్ ను మేమే అపాయింట్మెంట్ కోరాం ఎన్నికల నియమావళి ఉన్నందున వచ్చి కలుస్తాం అన్నారు…పీఆర్సీ పై చాలా స్పష్టంగా చెప్పారు. సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

- Advertisement -