మంగళవారం నల్గొండ సాయి నగర్ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డిలతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ని ఎమ్మెల్సీ ఓటు అభ్యర్ధించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నల్గొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. ఇటీవల మున్సిపల్ అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 458 కంపెనీలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
యాదాద్రి పవర్ ప్లాంట్, మూడు మెడికల్ కాలేజ్‌ల ఏర్పాటుతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. కళ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.