మహిళా దినోత్సవం…100 మొక్కలు నాటిన మహిళలు

189
womens day international
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ సందర్భాలకు వేదికగా నిలుస్తు అందరికీ ఆదర్శంగా నిలవడం జరుగుతుంది.ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుంట్లూరు‌ గ్రామం (నాగోల్) లోని శివాలయం ప్రాంగణంలో ఆ గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు, వాలంటీర్స్ కలిసి 100 మొక్కలను నాటడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు గా సమాజానికి మేలు జరిగే కార్యక్రమం చేయ్యాలి అనే ఉద్దేశంతో ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా శివాలయం ప్రాంగణంలో 100 మొక్కలు నాటడం జరిగింది అని వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటాము అని తెలిపారు.వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమం చేపట్టి మా అందరిలో స్ఫూర్తి నింపిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నడికుడి పద్మ, యాదమ్మ, అంజమ్మ, డాక్టర్ మార్కండేయులు, డాక్టర్ అన్నపూర్ణ ,జోరిక నరహరి, చేవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -