- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం నుండి అనేక అభ్యర్ధనలు ఉన్నప్పటికీ, గత 6 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని విద్యా సంస్థలను మంజూరు చేసిందో గ్రహించండి?.. ఏమీ లేదు గుండు సున్న అని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. దేశంలో కొత్తగా 5 ఐఐఎం, 2 ఐఐఎస్‌సీఆర్, 16 ఐఐఐటీ, 4 ఎన్‌ఐడీ, 84 నవోదయాలు, 157 మెడికల్ కాలేజీలు మంజూరి చేస్తే తెలంగాణకు కేటాయించింది మాత్రం ‘0’ అని ట్వీట్ చేశారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీపై ఉలుకు పలుకు లేదు అన్నారు. ఇది వివక్ష కాకపోతే, ఏమిటి? అని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇచ్చిందని బీజేపీకీ ఎందుకు ఓటు వేయాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
- Advertisement -