ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు..

203
corona
- Advertisement -

ఏపీలో స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహించగా 115 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 93 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,462 మంది కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

ఇంకా 921 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,173కి చేరింది.కొత్తగా నమోదైన కేసులలో చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

- Advertisement -