ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ శంషాబాద్ లోని ఓ ఆడిటోరియం లో పట్టభద్రుల ఓటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్, ఎమ్మెల్సీదామోదర్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు….ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మూడేళ్లలో కట్టాం….ఇదిదేశానికే ఆదర్శం అన్నారు. ఈ ఏడాది కోటి ఎకరాల సాగు జరుగుతోంది…70 ఏళ్లలో కేవలం ౩౦ లక్షల ఎకరాల సాగు జరిగేదన్నారు. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది…ఊర్లు విడిచి వెళ్లిన వారు తిరిగి గ్రామాలను తిరిగి వస్తున్నారని తెలిపారు హరీశ్.
సాగు నీరు ,రోడ్, నెట్ వర్క్, ఇంటర్నెట్ సౌకర్యం, కోతలు లేని విద్యుత్ ఇస్తున్నాం…..అందుకే గ్రామాలకు తిరిగి వస్తున్నారని తెలిపారు హరీశ్. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని…బీజేపీ వాళ్లు చాలా బాగా మాట్లాడుతున్నారు..ఐటీఐఆర్ మా వల్ల రాలేదని చెబుతున్నారు…దీనిపై కేటీఆర్ కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారు. సీఎం లేఖ రాశారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కు, కర్ణాటక రెండు రాష్ట్రాలకు ఐటీఐఆర్ ఇచ్చారు…యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని, ఆ క్రెడిట్ వారికి దక్కకూడదనే ఐటీఐఆర్ ను రద్దు చేశారని చెప్పారు. బడ్టెట్ లో 2.50 లక్షల ఎరువులు సబ్సిడీ కోత,గ్యాస్సబ్సిడీ లో కోత,రాష్ట్రానికి బడ్జెట్ లోకోతలు, ప్రజలకు వాతలే మిగిలిందన్నారు.ఎన్నికలు ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లకు మెట్రో విస్తరణకు అవకాశం ఇచ్చారు. కర్ణాటక లోను మెట్రో విస్తరణకు ఆమోదంతెలిపారు. గుజరాత్ కు బుల్లెట్ట్రైన్ ఇచ్చారు….తెలంగాణ కు మాత్రం మొండి చేయి చూపారన్నారు.
మనం కట్టే పన్నుల్లో 50 శాతం కూడా తిరిగి మనకు రావడం లేదు….ప్రగతి సాధించే మన రాష్ట్రంకన్నా వెనుకబడిన బీహార్ వంటిరాష్ట్రాలకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారని చెప్పారు. ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారు…ఒక్క మంచి పని చెప్పమనండన్నారు. ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా,బీఎస్ఎన్ఎల్ లో 5౦ శాతం మందిని ఉద్యోగులను తొలగించారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు, తెలంగాణ లోకూడా బీహెచ్ఈఎల్, బీడిఎల్ వంటి వాటిని ప్రయివేటుపరం చేస్తారు…ఉద్యోగులు ఆలోచించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు లేకుండా చేస్తుందన్నారు. ఐటీ గ్రోత్ లో మనం బెంగళూరును దాటి తొలిస్థానంలో ఉన్నాం…మహిళా ఓటర్లు మా మహిళా అభ్యర్థి వాణి దేవికి ఓటు వేయాలన్నారు హరీశ్ రావు.