విరాట్ చెత్త రికార్డు..

86
virat

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో చెత్త రికార్డు నమోదుచేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ కొంత కాలంగా ధోనీ రికార్డుల‌ను వెంటాడుతున్న డకౌట్ రికార్డులను సమం చేశారు.

గ‌తంలో ధోనీ కూడా కెప్టెన్‌గా 8సార్లు డ‌కౌట‌య్యాడు. ఇప్పుడు కోహ్లి అత‌ని రికార్డును స‌మం చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లి డ‌కౌట్ కావ‌డం ఇది రెండోసారి. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డ‌కౌట్ కాగా.. విరాట్ 12సార్లు డ‌కౌట‌య్యాడు. టెస్టుల్లో ఇషాంత్ శ‌ర్మ 32 డ‌కౌట్ల‌తో టాప్‌లో ఉన్నాడు.

ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్‌గా మ‌న్న‌న‌లు అందుకుంటున్న విరాట్.. ఏడాదికాలంగా ఫామ్‌లో లేడు. 2020లో ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌లేదు. ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌లో అయినా అత‌డు క‌చ్చితంగా చేస్తాడ‌ని అభిమానులు ఆశించినా నిరాశగానే మిగిలింది.