- Advertisement -
సీపీఐ నారాయణ ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన మాటలే కాదు తిరుమల వెళ్లినా,దేవాలయాలకు వెళ్లినా అదో ప్రత్యేకమే. తాజాగా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి వార్తల్లో నిలిచారు నారాయణ.
వివరాల్లోకి వెళ్తె..ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. 97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన ఆయన.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు.
తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన నారాయణ.. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కాగా, శారదా పీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడంలో పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరంగా మారింది.
- Advertisement -