వాణీదేవిని గెలిపించండి: మంత్రి నిరంజన్ రెడ్డి

154
Niranjan Reddy
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభీ వాణీదేవిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

గతేడాది కొవిడ్‌ వచ్చింది, మరి అంతకు ముందు ఆరేళ్లు ఏం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలను మంచి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేసి విపక్షాలు ఓట్లడగాలి.. కానీ సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను ప్రస్తావించిందని, కాంగ్రెస్‌ ఆలోచనలను మోదీ అమలులోకి తెచ్చిందన్నారు. కొత్త చట్టాలపై మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని, ఆ విషయంలో ఆ రెండు పార్టీలది ఒకే వైఖరి అన్నారు.

మాజీ ప్రధాని కూతురు అయినా వాణీదేవిది సాధారణ జీవితమేనన్నారు. విద్యావేత్తగా ఆడంబరాలకు దూరంగా జీవించారని, పాలమూరు కోడలికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిద్దామన్నారు. వాణీదేవి తప్ప ఎవరు గెలిచినా సమస్యలు పరిష్కరించే అవకాశం లేదన్నారు.

- Advertisement -