కర్ణాటక బీజేపీ నేతలు చిక్కుల్లో పడ్డారు. సాక్ష్యాత్తూ ఓ మంత్రి సెక్స్ స్కాండల్లో చిక్కుకున్నారు. ఓ యువతితో కర్ణాటక ఇరిగేషన్ మంత్రి రమేష్ జర్కి హోలి చనువుగా ఉన్న వీడియో బయటకు రావడం దేశమంతా చర్చనీయాంశంగా మారింది.
ఓ డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో,ఫోటోలు బయటకు రావడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి. ప్రాణభయంతోనే ఆ యువతి తన సాయం కోరిందని తన ఫిర్యాదులో దినేశ్ వెల్లడించగా అయితే తాను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన పనిలేదని మంత్రి జార్కిహొళి అన్నారు. వీడియో బహిర్గతం అయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించారు.