ఏప్రిల్‌ 2న ‘వైల్డ్‌డాగ్‌’ విడుదల..

438
Wild Dog
- Advertisement -

కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌ 2న విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబుదాడి ఘటనను ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రమిది. నర మేధానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి వైల్డ్‌డాగ్‌ టీమ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? దేశం కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతూ ఈ బృందం సాగించిన పోరాటమేమిటన్నది చిత్ర కథ’ అని అన్నారు

‘ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యే కథాంశమిది. పాత్రలన్నీ నిజజీవితాల్ని పోలి ఉంటాయి. వైల్డ్‌డాగ్‌ టీమ్‌ కమాండర్‌గా నేను కనిపిస్తా. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. కరోనా భయపెట్టినా ధైర్యంగా షూటింగ్‌ పూర్తిచేశాం. కోవిడ్‌ భయాలు ఎక్కువగా ఉండటంతో థియేటర్‌లో విడుదల చేస్తే సినిమా చూసేందుకు ప్రేక్షకులు వస్తారా?లేదా? అనే భయం అందరిలో మొదలైంది. అదే సమయంలో ఓటీటీ సంస్థ చక్కటి ఆఫర్‌తో మమ్మల్ని సంప్రదించడంతో వారి ప్రతిపాదనను అంగీకరించాం. ‘క్రాక్‌’, ‘ఉప్పెన’ విజయాలు మాలో ధైర్యాన్ని నింపాయి. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ప్రేక్షకులకు చక్కటి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచాలనే ఆలోచనతో భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా ఇది. అందుకే ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు.

- Advertisement -