న‌టి అలేఖ్యను‌ స‌న్మానించిన ఎమ్మెల్సీ క‌విత..

292
mlc kavitha
- Advertisement -

క‌రోనా కార‌ణంగా గతేడాది దేశ‌మంత‌టా లాక్ డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎంతో మంది ముందుకొచ్చి నిరుపేద‌ల‌కు నిత్య‌వ‌స‌రాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా సినిమా వారు నిరుపేద‌ల‌కు సాయ‌ప‌డ్డారు. అందులో భాగంగా దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్య‌వ‌స‌రాలు పంపిణీ చేసిన న‌టి అలేఖ్యను కేంద్ర‌ ప్ర‌భుత్వం వారు క‌రోనా హీరోగా గుర్తించి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుతో స‌త్క‌రించారు. ఈ పుర‌స్కారం సౌత్ ఇండియా త‌ర‌పున న‌టి అలేఖ్య అందుకోగా, నార్త్ ఇండియాలో న‌టులు సోనూసూద్, అక్ష‌య్ కుమార్, న‌టి దీపికా ప‌డుకొనే అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అలేఖ్య‌ను వారి ఇంటికి పిలిపించుకొని స‌న్మానించి..ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాన్ని చేసి ..అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారంటూ ప్ర‌శంసించారు క‌విత‌. న‌టి అలేఖ్య మాట్లాడుతూ…క‌విత గారు ప్ర‌త్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఇలా ప్ర‌శంసించ‌డంతో మరెన్నో మంచి ప‌నులు చేయాల‌న్న ఉత్సాహం క‌లిగింది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంతో మందికి సాయ‌ప‌డిన అలేఖ్య‌ను మ‌రియు దాదాపు 15 వేల మందికి నిత్య‌వ‌స‌రాలు పంపిణీ చేసిన మా తెలంగాణ ఫిలించాంబ‌ర్‌ను అభినందిస్తూ మ‌రెన్నో ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌నీ, మీకు మా ప్ర‌భుత్వం త‌ర‌పున ఎటువంటి సాయ‌మైనా అందించ‌డానికి సిద్ధంగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. క‌విత ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో భ‌విష్య‌త్‌లో ఇలాంటివి మ‌రెన్నో చేయాల‌న్న ఆస‌క్తి పెరిగింది అని అన్నారు.

- Advertisement -