- Advertisement -
రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్ధానాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది టీఆర్ఎస్. ఇప్పటికే నల్గొండ,ఖమ్మం,వరంగల్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే సీటు కేటాయించగా మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ నియోజకవర్గానికి పీవీ కూతురు వాణీదేవి పేరును ప్రకటించారు.
ఇక ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపుకోసం వ్యూహాలను రచిస్తోంది టీఆర్ఎస్. ముఖ్యంగా వాణీదేవి గెలుపుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నియోజకవర్గం కావడంతో ఉమ్మడి జిల్లాకో మంత్రి చొప్పున ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జీగా హరీష్ రావు,మహబూబ్ నగర్ జిల్లా బాధ్యతలు ప్రశాంత్ రెడ్డికి,హైదరాబాద్ బాధ్యతలు మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు.
- Advertisement -