కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత..

211
mlc kavitha
- Advertisement -

దేవాలయాల అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేవాలయాలకు బడ్జెట్ కేటాయించిన చరిత్ర ఒక్క తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. గురువారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దర్శించుకున్నారు. అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దేవస్థానాల్లో కొండగట్టు ఒకటి. చిన్న జయంతి, పెద్ద జయంతికి మధ్య కొండగట్టుకు వేలాది మంది హనుమాన్ దీక్షపరులు వస్తారు. ఇటీవల కాశీ సంకట హనుమాన్ దేవస్థానం దర్శించానని కవిత తెలిపారు. అక్కడ సైతం కొండగట్టు దేవస్థాన ప్రస్తావన వచ్చింది. త్వరలో హనుమాన్ నామ సంకీర్తన చేపడుతామని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -