ఫ్రై డే మూవీస్‌…అందరి చూపు నితిన్ వైపే!

184
tollywood
- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా థియేటర్లు ప్రస్తుతం వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విడుదలైన ఉప్పెన మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ వారం 9 సినిమాలు రిలీజ్ కానుండగా అందరి చూపు నితిన్ చెక్ మూవీ వైపే ఉంది. తన కెరీర్‌లోనే చెక్ బిగ్గెస్ట్ మూవీగా నిలవనుందని నితిన్ వెల్లడించారు డిఫరెంట్ ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక మిగితా సినిమాల్లో MMOF,లాయర్‌ విశ్వనాథ్‌ ,అంగుళీక,అక్షర ,ఏప్రిల్‌ 28న ఏం జరిగింది,క్షణం క్షణం,నువ్వు నేను ఒక్కటైతే ,బాల మిత్ర విడుదల కానున్నాయి.

- Advertisement -