ఓం నమో వెంకటేశాయ వద్దన్న నాగ్ ..!

223
Nag Rejects ONV says Raghavendra Rao
- Advertisement -

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ  తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని  రూపొందించారని దర్శకనిర్మాతలను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ స‌ద‌ర్భంగా ద‌ర్శ‌కుడు
కె.రాఘ‌వేంద్రరావుతో ఇంట‌ర్వ్యూ….

రెండింటికీ పోలిక లేదు…
– అన్న‌మ‌య్య‌, ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలు రెండు వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుల క‌థ‌లే. అయితే ‘అన్నమయ్య’ పూర్తిగా భక్తుడి కోణంలోనుంచి చెప్పిన కథ. ‘ఓం నమో

వెంకటేశాయ’ కూడా భక్తుడి కోణంలోనే చెప్పినా, ఇందులో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న మరో కొత్త కోణం కూడా ఉంది.అలాగే క‌థ‌లోని ఎమోష‌న్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయి

కాబ‌ట్టి రెండు సినిమాల‌కు పోలిక లేదు.
అవి తెలిస్తే చాలు…?
– మ‌న క‌థ‌కు కావాల్సిన అంశాల్లో ముఖ్య‌మైన ఎలిమెంట్స్ తెలిస్తే చాలు. ఆ స‌మాచారంతో కొంత‌ సినిమాటిక్ లిబర్టీతో ఫిక్షన్ జత చేసి సినిమాను రూపొందించాం. అంటే సినిమాలో ఉండేవ‌న్నీ జ‌రిగాయ‌ని కాదు, మ‌న‌కు తెలిసిన ఇన్‌ఫ‌ర్మేష‌న్ కొంత అయితే  జ‌త చేసింది కొంత. అన్న‌మ‌య్య సినిమా స‌మ‌యంలో కూడా చివ‌రి భాగాన్ని డ్ర‌మ‌టైజ్ చేసి సినిమాగా తీశాం. ఇలాంటి సినిమాల్లో జ‌రుగుతూనే ఉంటాయి.
ముందు ఒప్పుకోలేదు…
– అన్న‌మ‌య్య సినిమాతో పోల్చుకుని నాగార్జున అయితే సినిమా వ‌ద్ద‌ని అన్నాడు. అయితే నేను ముందు క‌థ విన‌మ‌ని చెప్పాను. స‌రేన‌ని క‌థ విన్నాడు. విన‌గానే త‌న‌కు బాగా న‌చ్చేసింది. అన్న‌మ‌య్య సినిమాలో క్లైమాక్స్ ఎంత బావుంటుందో ఈ సినిమాలో క్లైమాక్స్ అంత హైలైట్‌గా ఉంటుంది.

Nag Rejects ONV says Raghavendra Rao
నాగార్జున త‌ప్ప ఎవ‌రూ చ‌య‌లేరు…
– క‌థ రాసుకునేట‌ప్పుడే నాగార్జునే నా మైండ్‌లో మెదిలాడు. నాగార్జున ఒప్పుకోకపోతే నేనైతే ఈ సినిమా చేసేవాడ్ని కాదు.
దేవుడే చేయించాడు…
– నాగార్జున‌తో ఓం న‌మో వేంక‌టేశాయ వంటి సినిమా చేయ‌డం చూస్తే ఆ దేవుడే రాసిపెట్టి చేయించాడేమో అనిపిస్తూంటుంది. భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొస్తారు. ఈ సినిమాలోనూ రామ్ బాబాగా ఆయన నటన అద్భుతం. కొన్ని సన్నివేశాలు తీసేప్పుడు నేనే చాలా ఎమోషనల్ అయిపోయి కట్ కూడా చెప్పేవాడిని కాదు. సెట్లో ఉన్న అందరికీ నాగ్‌ని చూస్తే రామ్ బాబాను చూసినట్టే అనిపించేంది. మా కాంబినేషన్‌లో ఇలా ఇన్ని భక్తిరస చిత్రాలు రావడం అదృష్టం. భక్తిరస చిత్రాలు నేనొక్కడినే తీయగలనని ఏమీ లేదు. ఏ దర్శకుడైనా చేయొచ్చు. ఒక్క భక్తిరస చిత్రాలనే కాకుండా నిజ జీవిత కథలు, పురాణాలు.. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పటి దర్శకులంతా ఈ తరహా సినిమాలు చేసేయొచ్చు.

రిస్క్ అనిపించ‌లేదు…

–  రిస్క్ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఎమోషన్‌తో ఓ కథ చెప్తే, అది ఏ జానర్ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే యూత్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. ఓం నమో వెంకటేశాయ కథ అలాంటిది. మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకున్నాం. తిరుమలలో షూటింగ్‌ చేయడానికి ఎప్పుడూ అవకాశం లేదు కాబట్టి అందుకోసం కెమెరామేన్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కలిసి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిక్‌మంగళూరు, మహాబలేశ్వరం లొకేషన్స్‌ను ఎంపిక చేశారు. నేను, రచయిత జేకే భారవి కలిసి ఇక్కడ కాస్ట్యూమ్స్, సినిమాటిక్‌గా ఈ కథను ఎలా మార్చొచ్చు అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సెట్స్‌పైకి వెళ్ళాక ఆ దేవుడి దయవల్లే ఒక్క ఆటంకం కలగకుండా సినిమా పూర్తైంది.

అలా అనుకోవ‌డం లేదు..
– ఇప్పటివరకూ నా జీవితమంతా ఆ దేవుడు చెప్పినట్లే జరుగుతూ వస్తుందనుకుంటున్నా. ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యానన్నా అంతా ఆ దేవుడి దయవల్లే! ‘ఓం నమో వెంకటేశాయ’ నా చివరి సినిమా అని నేను అనుకోవట్లేదు. ఆ దేవుడేమనుకుంటున్నాడో తెలియదు కదా అంటూ ముగించాడు.

- Advertisement -