దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
మహారాష్ట్ర నుండి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో బోధన్ మండలం సాలుర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు.
ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలను మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు పంపింది కేంద్రం. ఓవరాల్‌గా మళ్లీ కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.