వాణీ దేవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం…

127
koleti damodhar
- Advertisement -

భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు మహామేధావి, స్వాతంత్య సమరయోధుడు, బహుభాషావేత్త, రచయిత, పాలనాదకుడు. ప్రతిభాపాటవాలలో భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు సమానమైనవాడు. ఇంతవరకు దక్షిణాది నుంచి దేశ ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. అన్నింటికీ మించి తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం పీవీ నరసింహరావు అన్నారు కోలేటీ దామోదర్.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా వుండి, శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగిక వర్గంలో ఒకడుగా మెలిగిన పీవీ అనుకోని పరిస్థితులలో తలవని తలంపుగా దేశప్రధాని అయినారు. అప్పుడు కాంగ్రెస్ కి పార్లమెంటులో చాలినంత బలం లేదు. ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సాము. దేశ ఆర్ధిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయి, మన బంగారం నిల్వలను విదేశాలలో కుదువ పెట్టి అప్పు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రధానమంత్రి పదవి ఒక ముళ్ళకిరీటం వంటిది. ఆ కిరీటాన్ని పీవి ధరించి, చాణక్య నీతితో ప్రతిపక్షాలను కలుపుకుపోతూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ, దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్ది విదేశాలలో కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి తెప్పించి దేశ ప్రతిష్టను కాపాడడమే కాక కాంగ్రెస్ పార్టీని బ్రతికించారు.

ఇంత చేసినా ఆయన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులకే పీవీ మీద గౌరవ మర్యాదలు లేవు. ప్రధానిగా వున్నప్పుడే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రధానిగా ఆయన ఐదేళ్ళ పదవీకాలం జయప్రదంగా పూర్తి చేసుకుంటే ఓర్వలేకపోయారు. ఆయన పై చిల్లర మల్లర కేసులు పెట్టించి, కోర్టుల చుట్టూ తిప్పించారు. కష్టకాలంలో ఒక్కరూ అండగా నిలువలేదు. మరణానంతరం కూడా ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి పార్థివ దేహానికి లభించవలసిన గౌరవాలు ఆయనకు దక్కనివ్వలేదన్నారు.

గారి మహోన్నత వ్యక్తిత్వం తెలంగాణ బిడ్డలందరికీ గర్వకారణం. కాంగ్రెస్ విస్మరించినప్పటికీ పీవీ గారిని, పీవీ గారి కుటుంబాన్ని కేసిఆర్ గారు భుజాలకెత్తుకుని వారికి తిరిగి తెలంగాణలో సముచిత స్థానం సముపార్జించి పెట్టడానికి కృషి చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యంలో మనం కూడా భాగస్వాములమై, నామినేషన్లు వేసిన వారందరూ ఉపసంహరించుకుని, తెలంగాణాకే గర్వకారణమైన పీవీ నరసింహారావు గారిపై మనకు గల అభిమానానికి గుర్తుగా ఆయన కుమార్తె శ్రీమతి సురభి వాణీ దేవి గారిని ఏకగ్రీవంగా ఎం.ఎల్.సి.గా ఎన్నుకుని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందామని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్ర ఓటరు మహాశయులకు, అన్ని పార్టీలవారికీ ఇందుమూలంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

- Advertisement -