మెగా ఫ్యామిలీలో ఆదిపత్య పోరు …

262
Cold War Between Allu Arjun And sai daram
- Advertisement -

మెగా ప్యామిలీలో ఘర్షణ అనగానే వెంటనే అందరికి గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీరిద్దరికి సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చిన టాలీవుడ్‌ని షేక్  చేస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతుంది. కానీ తర్వాత అది టీ కప్పులో తుఫాన్‌గా మిగిలిపోతుంది. అయితే ఈ సారి మెగాఫ్యామిలీలో ఆదిపత్య పోరు వారసుల రూపంలో వచ్చింది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ, అల్లు అరవింద్ తనయుడు, చిరు అల్లుడు అర్జున్‌ మధ్య అసలు పడటం లేదట. వీరిమధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుందట. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ఓ  ఫంక్షన్‌లో ఈ విషయం బయటపడింది.  ఆ ఫంక్షన్‌కు హాజరైన వీరిద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారట.

ఇక వీరిద్దరి మధ్య గ్యాప్‌ పెరగడానికి ఒక కారణం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అయితే మరో కారణం నందమూరి బాలకృష్ణ. ఇటీవల సాయిధరమ్ తేజ నందమూరి ఫ్యామిలీకి బాగా  కనెక్టయ్యాడు. ఎంతలా అంటే గౌతమీపుత్ర శాతకర్ణిని అభినందించటం దగ్గరి నుంచి తన కొత్త సినిమా ఓపెనింగ్ తారక్‌తో క్లాప్ కొట్టించేంత వరకు. బాలకృష్ణ వందో సినిమాగా వచ్చిన శాతకర్ణిపై ధరమ్ తేజ ప్రశంసలు గుప్పించాడు. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్ చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే, ఈ సుప్రీం హీరో ఇవేమి పట్టించుకోకుండా మెగా కాంపౌండ్‌కు కాస్త దూరం జరిగి నందమూరి హీరోలకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అంతర్గతంగా ఫ్యాన్స్‌తో పాటు బన్నీకి కూడా ఈ విషయం ఆగ్రహం తెప్పించిందట. మామ చిరు సినిమాకు పోటీగా వచ్చిన శాతకర్ణిని అభినందించటం ఏంటని కుటుంబసభ్యుల మధ్య బన్నీ ఆసక్తికర చర్చకు లేవదీశాడట.

దీంతో పాటు  ధరమ్‌ తేజ సినిమా ప్రారంభానికి హాజరైన అల్లు అర్జున్‌ …. పవన్‌కి ఈ సుప్రీం హీరోకి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేశాడు. అభిమానులు పదే పదే పవన్‌ గురించి

మాట్లాడమని అల్లరి చేస్తుండగా స్పందించిన బన్నీ …. పవర్ స్టార్ అంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. సాయి ధరమ్ హీరో అవుతాడని తాము అస్సలు భావించలేదని పవన్ వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాడని తెలిపాడు. ఈ విషయాన్ని సాయి ఎందుకు చెప్పలేదో తనకు అర్దం కాలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుర్రుగా ఉన్న ధరమ్ తేజ … పవన్‌కి పర్సనల్‌గా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. ఇప్పుడు ఇదే టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, మెగా బ్రదర్స్ మధ్య వచ్చిన గొడవల్లాగానే బన్నీ, సాయి మధ్య గొడవ సద్దుమనుగుతుందో లేదో మరింత దూరం వెళుతుందో చూడాలి.

- Advertisement -