బండి సంజయ్ దమ్ముంటే నా సవాల్ స్వీకరించు:ప్రశాంత్ రెడ్డి

210
prashanth reddy
- Advertisement -

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో 52 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. రైతు వేదిక,సొసైటీ బిల్డింగ్ అదనపు గదులు ప్రారంభోత్సవం మరియు కళ్యాణ మండపం షెడ్ శంకుస్థాపన మరియు భూమిపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే తో కలిసి పాల్గొన్నారు..

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.రైతు బంధు,రైతు భీమా,24గంటల నాణ్యమైన కరెంట్,కళ్యాణ లక్ష్మీ,కేసీఆర్ కిట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.పెన్షన్ ల మీద,ఇతర సంక్షేమ కార్యక్రమాల మీద నేను రాజీనామా సవాల్ విసిరితే బండి సంజయ్ చప్పుడు లేదన్నారు.

బండి సంజయ్ దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని,కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. మా సహనాన్ని పరిక్షించొద్దని హెచ్చరించారు.కేసీఆర్ కు వంద కిలోమీటర్ల దూరమే నీవెప్పుడు…కేసీఆర్ ను విమర్శిస్తే పెద్దోడివి ఐపోవని హితవు పలికారు.కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపించాలని అన్నారు.మీ పార్టీ పెద్దలను కేంద్రంలో లో మీ ప్రభుత్వ పెద్దలను మేము మీకంటే బాగా తిట్టగలం…కానీ మాకు సంస్కారం అడ్డువస్తుందని తెలిపారు.రాజకీయ స్వార్థం కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.విమర్శలు మానుకొని వీలైతే రాష్ట్రానికి మంచి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభరాజు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -