ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది : అల్లరి నరేష్

162
naresh
- Advertisement -

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది సక్సెస్ మీట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, నిర్మాతలు కేఎస్ రామారావు, అనిల్ సుంకర, హీరో సందీప్ కిషన్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ…..నరేష్ గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయనతో నేను రెండు కాెడీ సినిమాలు చేశాను. ఒక సీరియస్ సినిమా చేయాలని ఉంది. కానీ అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఆడియెన్స్ మాటలు వింటే కడుపు నిండిపోతుంది. వరలక్ష్మీ కనిపించగానే జయమ్మ జయమ్మ అని కేకలు వినిపిస్తున్నాయి. ఆర్టిస్టులు అంతా చాలా బాగా నటించారు. హీరోయిన్ అందంగా ఉంది. ప్రియదర్శి, ప్రవీణ్ చాలా బాగా నటించారు. కృష్ణేశ్వరరావు తాగుబోతు క్యారెక్టర్ ఇంకా బాగుంది. ఒక సినిమాపై ఇష్టం ఏర్పడాక ఎంతైనా మాట్లాడాలని అనిపిస్తుంది. కోర్ట్ డ్రామా చేయడం ఎంత కష్టమో దర్శకుడికే తెలుస్తుంది. చిన్న పాయింట్ మిస్ అయినా బోర్ కొడుతుంది. అలాంటి గ్రిప్పింగ్ గా కోర్ట్ డ్రామా చేశాడు. అది మామూలు దర్శకుల వల్ల కాదు. విజయ్ ను చూడగానే ఇతను పెద్ద దర్శకుడు అవుతాడని అనుకున్నాను. నిర్మాత సతీష్ నిర్మాతగా అద్భుతంగా వ్యవహరించారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. సేమ్ యూనిట్ మళ్లీ సినిమా చేయాలి. అన్నారు.

రమేష్ రెడ్డి మాట్లాడుతూ…నాంది స్టార్ట్ అయ్యేప్పుడు నరేష్ గారు ఈ సినిమా ఏంటి దర్శకుడు విజయ్ కు మతిపోయిందా అన్నారు చాలా మంది. మరికొందరు ఇంకో రకంగా విమర్శించారు. కానీ విజయ్ పది కాలాలు మిగిలిపోయే సినిమా చేశాడు. వెంకట్ రాసిన కథ మీద నమ్మకంతో, దర్శకుడి మీద నమ్మకంతో నిర్మాత సతీష్ గారు నరేష్ గారి దగ్గరకు వెళ్లారు. నరేష్ గారు వీళ్ల నమ్మకం చూసి సినిమా ఒప్పుకున్నారు, కసిగా నటించి, హిట్ కొట్టారు. నరేష్ గారు ఈ సినిమా విజయానికి మొదటి కారణం. గమ్యంలో క్రిష్, మహర్షిలో వంశీ పైడిపల్లి గారు నరేష్ భిన్నమైన పాత్రలు చేయగలరని చూపించారు. విజయ్ అదే దారిలో వెళ్లారు. మంచి సినిమా చేస్తే విజయానికి ఏదీ అడ్డు కాదు అని నాంది టీమ్ నిరూపించింది. అన్నారు.

నటుడు చక్రపాణి మాట్లాడుతూ….రథ సప్తమి రోజు సూర్యుడు తన రథం దిశమార్చుకుంటాడు. అదే రోజున విడుదలైన నాంది సినిమాతో అల్లరి నరేష్ గారి నట దిశ మారింది. అన్నారు.ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ…నాంది సినిమా మా చిత్ర బృందం అందరికీ గౌరవం తెస్తుందని నమ్మాం. ఇప్పుడు అదే జరిగింది. అన్నారు.ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ…ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. కాన్సెప్ట్ బేస్ డ్ సినిమాలకు ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది. అలా ప్రతి క్షణం జాగ్రత్తగా సినిమా చేశాం. మేమంతా ప్రెండ్స్ అవడం వల్ల టెక్నీషియన్స్ అంతా కలిసి ఒకే ఆలోచనతో పనిచేశాం. నరేష్ గారితో తొలి సినిమా చేశాను. ఈ సినిమా చేశాక నరేష్ గారికి ఫ్యాన్ అయ్యాను. అన్నారు.

అబ్బూరి రవి మాట్లాడుతూ…కథకు సరైండర్ అయి అంతా పనిచేసిన సినిమా ఇది. అలా చేయడం వల్లే నాంది హిట్ అయ్యింది. దర్శకుడు ఏది చెబితే అది, కథ ఏది డిమాండ్ చేస్తే అది నరేష్ గారు చేశారు. ఈ టీమ్ అంతా సినిమా కోసం ప్రాణం పెట్టే మనుషులు. ప్రతి ఒక్కరూ విజయ్ కు హిట్ కావాలని కోరుకున్నారు. ఇంత విజయాన్ని ఇచ్చి వారికి హాట్సాఫ్. అన్నారు.స్టోరీ రైటర్ తూము వెంకట్ మాట్లాడుతూ….సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. రాజా, భూపాల్ ఇద్దరూ ఈ కథను దర్శకుడు, నిర్మాత, నరేష్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆర్నెళ్లు కథ మీద వర్క్ చేసి షూట్ కు వెళ్లాం. ఆ వర్క్ అంతా నాంది సినిమా చూస్తున్న వాళ్లు ఫీలవుతున్నారు. నరేష్ గారిని ఎంతో ఇబ్బంది పెట్టాం చిత్రీకరణ టైమ్ లో …నరేష్ గారు అదంతా భరించి సినిమా కోసం పనిచేశారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ…ఐదేళ్ల క్రితం క్షణం అనే సినిమా రిలీజైంది. ఇప్పుడు నాంది. అదే ఫోర్స్ తో విజయం దక్కింది. ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ సూపర్బ్ గా పనిచేశారు. అందుకే ఇలాంటి విజయం దక్కింది. అన్నారు.

హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ…కంటెంట్ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. కథ విన్నప్పుడే అది చెప్పాను. పోలీస్ పాత్రలు చేయను అని చెప్పాను. కానీ ఈ సినిమా కథ విని ఒప్పుకున్నాను. నా కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ఇది. సినిమా చూసి బయటకొచ్చాక నాపై చాలా మంది నిజంగా కోపం పెంచుకున్నారు. నా క్యారెక్టర్ అంత ఎఫెక్టివ్ గా ఉంది. అంత క్రూరంగా ఉంటుంది నా క్యారెక్టర్. ఎన్ని సినిమాలు చేసినా సతీష్ నాంది నిర్మాతగానే గుర్తుండిపోతారు. నరేష్ గారు ఈ క్యారెక్టర్ కు అంకితం అయి సినిమా చేశారు. అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ…సినిమా హిట్ అయితే రివ్యూలు రాయడం, చదవడం హాయిగా ఉంటుంది. ప్రేక్షకులు ఉప్పెనంత ప్రేమతో ఇలాంటి మంచి సినిమాల విజయాలకు నాంది పలికారు. క్యారెక్టర్ కోసం నన్ను నమ్మిన దర్శకుడు విజయ్ కు థ్యాంక్స్. నరేష్ గారి గమ్యం లాంటి సినిమాలు చూసి బాగా నటిస్తారని ఒక ప్రేక్షకుడిగా తెలుసుకున్నాను. వరలక్ష్మీ గారిని మక్కల్ సెల్వీ అని పిలవొచ్చు. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…నరేష్ మా బ్యానర్ హీరో. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నరేష్ గారికి 8 ఏళ్లుగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాందితో హిట్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. యూఎస్ నుంచి రాగానే సినిమా చూశాను. ఇదొక్కటే కాదు ప్రతి కథకి, సినిమాకు సరెండర్ అయి నటించే హీరో నరేష్. ఆయన చాలా మంచి నటుడు. మహర్షి తర్వాత నరేష్ ను ఇలాంటి క్యారెక్టర్ లో చూడాలని అంతా అనుకున్నారు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ…టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా నేను చూడలేదు. మీ అందరు మాట్లాడింది విన్నాక. మంచి సినిమా మిస్ అయ్యాను అనుకుంటున్నాను. నరేష్ ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ల నాన్న నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి తిరుపతి వెళ్లినప్పుడు నరేష్ ను హీరో చేయమని ఈవీవీ గారికి చెప్పాను. నరేష్ బాగా నటించాడని అంతా చెప్పడం సంతోషంగా ఉంది. కొత్త సినిమాను ఆదరించాలని అనుకునే ప్రేక్షకులకు అలాంటి సినిమా ఇచ్చారు. మిగతా భాషల సినిమాలు రిలీజ్ కు భయపడుతుంటే టాలీవుడ్ లో ఉప్పెన, నాంది లాంటి సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ…సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరి నిజాయితీనే ఈ నాంది సినిమా విజయానికి కారణం. నరేష్ చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో నాంది ఒకటి అవుతుంది. మహర్షి లో నేను నరేష్ గారికి అవకాశం ఇవ్వలేదు. మాకే ఆయన అవకాశం ఇచ్చారు. ప్రయత్నం చేస్తే విజయం తప్పక దక్కుతుంది అనేందుకు నరేష్ గారే నిదర్శనం. తెలుగు ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారం. ఇంత మంచి సినిమాను ఆదరించినందుకు. ఇండస్ట్రీ మంచి జోరుమీద ఉండగా, కరోనా వచ్చింది. అంతా భయపడ్డాం. కానీ ఒక్కో సినిమాను హిట్ చేస్తూ మొత్తం దేశం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు మన ప్రేక్షకులు. విజయ్ నాకు సహాయ దర్శకుడిగా తెలుసు. ఆయన ఇలాంటి కొత్త టైప్ ఆఫ్ సినిమా చేస్తాడని ఊహించలేదు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ…కరోనా తర్వాత ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడుతున్న టైమ్ లో క్రాక్, ఉప్పెన, నాందితో ఆ భయాలన్ని పోయాయి. మా నరేష్ కు సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈవీవీ గారి దగ్గర అసోసియేట్ గా పనిచేశాను. నరేష్ బాగా తెలుసు. జెన్యూన్ యాక్టర్. నాంది నరేష్ కు కరెక్ట్ స్క్రిప్ట్. విజయ్ కు కంగ్రాట్స్ చెప్పాలి. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ ఏదో కమర్షియల్ సినిమా చేయకుండా, కొత్త టైప్ ఆఫ్ సినిమా చేశాడు. నిర్మాత సతీష్ గట్స్ కు హాట్సాఫ్. వరలక్ష్మీకి ఇంకా మంచి ఆఫర్లు రావాలి. సినిమా యూనిట్ అందరిలో పాజిటవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అన్నారు.

పాటల రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ…ఈ సినిమా టైటిల్ సాంగ్ లో కోరుకున్న కొత్త తీర్పు రాయడానికి అని ఒక లైన్ రాశాను. అదే ఇవాళ ప్రేక్షకులు నిజం చేశారు. కొత్త తీర్పు ఇచ్చారు. మీడియా మంచి రేటింగ్స్ ఇచ్చారు. విజయవంతంమైన చిత్రంలో పనిచేసినప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందంలో నేనూ ఉన్నాను. నాందికి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, నరేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. నరేష్ గారు గొప్ప నటుడు. ఈ కథలో ఆయన నటన చూపించారు. అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ…మా నరేష్ అన్న సినిమాకు హిట్ రావడం సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అన్నా. మనం ఎంత కష్టపడ్డా ఎవరికీ గుర్తుండదు. కానీ విజయం దక్కితేనే మన కష్టం అందరికీ తెలుస్తుంది. నాందితో నీ కష్టం ప్రపంచానికి తెలిసింది. విజయ్ మాతో చెప్పే విషయాలకు, ఈ కథకు సంబంధం లేదు. చాలా కొత్తగా తీశాడు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా రిలీజ్ ముందే అరగంట చూశాను. సూపర్బ్ గా సినిమా చేశావ్ అని దర్శకుడు విజయ్ కు చెప్పాను. అన్నారు.

నిర్మాత సతీష్ మాట్లాడుతూ…మా టీమ్ ను కంగ్రాట్స్ చేసేందుకు వచ్చిన దర్శకులు, నిర్మాతలకు థాంక్స్. నాంది విడుదల పదిరోజుల ముందు నుంచే బాగా పబ్లిసిటీ చేశాం. 19న మరో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. అవి డబ్బింగ్ సినిమాలు. వాటితో టెన్షన్ పడ్డాం. నాంది మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్ గానే ఉన్నాయి. టాక్ బాగుంది కలెక్షన్స్ లేవు అని ఎగ్జిబిటర్స్ చెప్పారు. నైట్ షోస్ కు హౌస్ ఫుల్ అని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇలా ప్రతి చోటు నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన ప్రచారం, పబ్లిక్ మౌత్ టాక్ ద్వారా చాలా మందికి సినిమా గురించి తెలిసింది. అన్నారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ…తెలుగు ప్రేక్షకులకు లైఫ్ టైమ్ రుణపడి ఉంటాను. మీడియా వాళ్లు కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎంత ఎమోషనల్ గా ఉంటానో సినిమాలో చూసి ఉంటారు. నరేష్ గారికి థ్యాంక్స్, కథ చెప్పిన వెంటనే షూటింగ్ కు రెడీ అయ్యారు. కోర్ట్ చాలా సహజంగా ఉంది అంటున్నారు. బ్రహ్మ కడలి గారికి థ్యాంక్స్. ఫొటోగ్రఫీ, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ సూపర్బ్ గా చేశారు. ఆర్టిస్ట్ లు అంతా బాగా నటించారు. మా ఇంటి పేరు నిలబెడుతూ కనకమేడ లాంటి హిట్ ఇచ్చారు. అన్నారు.

నవమి మాట్లాడుతూ…మంచి మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కేరళ నుంచి ఫ్రెండ్స్ కూడా సినిమా చూసి ఫోన్ చేస్తున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ….స్టేజీ మీద చాలా ఈజీగా మాట్లాడుతుంటాను కానీ ఇప్పుడు ఉద్వేగంగా ఉన్నాను. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇంత ప్రేమ దక్కలేదు. ప్రతిభను గౌరవించే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే రాణిలా చూసుకుంటారు అని చెప్పారు. అది నా విషయంలో మరోసారి నిజమైంది. నాంది టీమ్ అందరికీ థ్యాంక్స్. విజయ్ విజన్ ఇవాళ అంతా చూస్తున్నారు. చెన్నైలో షో వేసుకుని చూశాను. అమ్మ రాధిక నాంది సినిమా చూసి ఏడ్చేసింది. సూర్య ప్రకాశ్ క్యారెక్టర్ తో ఎంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కోర్ట్ రూమ్ సీన్స్ సినిమాటిక్ గా లేవు అంటున్నారు. నరేష్ ఒక్కో సీన్ అద్భుతంగా చేసి ఏడిపించారు. అన్నారు

హీరో నరేష్ మాట్లాడుతూ…2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్ ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను. మేము సినిమాలో చెప్పిన సెక్షన్స్ గురించి ఇటీవల ఓ పోలీస్ అధికారి సినిమా చూసి మెచ్చుకున్నారు. చాలా రీసెర్చ్ చేశారు కదా అని ఆయన అడిగారు. విజయ్ కు, రైటర్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను. విజయ్ గారికి చాలా చెక్స్ వచ్చి ఉంటాయి అడ్వాన్స్ లుగా. విజయ్ తో ఒకాయన మాట్లాడుతూ..ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటని అడిగాడట. అప్పుడు విజయ్ కథలో కంటెంట్ ఉండాలి, హీరో టాలెంటెడ్ అయి ఉండాలి సక్సెస్ ఫెయిల్యూర్ తో పనిలేదు అన్నాడట. దేవి ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన మంచి దర్శకుడు అని తెలుసు గానీ ఇంతమంచి నటుడు అని తెలియదు. ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటది. ఆరు నిమిషాల ఒక షాట్ ఉంటుంది, నేను వరలక్ష్మి, ప్రియదర్శి ఆ సీన్ లో చేయాలి. అంత సేపు ఎమోషన్ క్యారీ చేయాలి. చేయగలమా అనుకున్నాం. కానీ సీన్ చేశాక సంతృప్తిగా అనిపించింది. సతీష్ నిర్మాతగా ధైర్యం చేశారు. కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ప్రయోగాత్మక సినిమా ఏంటి అనుకోకుండా కొత్త తరహా సినిమా ప్రయత్నించారు. ఇకపైనా ఇలాంటి డిఫరెంట్ సినిమాలే చేయాలని కోరుతున్నా. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటాను. మరో రెండేల్లు ఇండస్ట్రీ కోలుకోదు అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. అన్నారు.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.

సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
బ్యాన‌ర్‌: ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజేష్ దండా
సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
క‌థ‌: తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
ఫైట్స్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

- Advertisement -