పీవీ కుటుంబానికి ఇచ్చిన అపురూప గౌరవం: ఎమ్మెల్యే గణేష్‌

24
bigala ganesh

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణిదేవి ఎంపిక పట్ల హర్షం వ్యక్తంచేశారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఇది పీవీ కుటుంబానికి ఇచ్చిన అపురూప గౌరవం… ఆ మహనీయుడి శతజయంతి వేళ ఆయనకు అందించే నివాళి అన్నారు.

పట్టభద్రుల సమస్యలపై ఆమెకు సంపూర్ణ అవగాహన ఉందని…విద్యావేత్తగా వాణీదేవి విద్యారంగంలో సుదీర్ఘంగా పనిచేశారని తెలిపారు గణేష్‌. ఇప్పు డు చట్టసభల ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందని…. ఆ స్థానానికి వాణీదేవి తగిన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.